ఉన్నతి-అభ్యున్నతి
🌼🌼🌼🌸🌸🌸
సాధించిన స్వాతంత్రం వయస్సు ఎన్నో దశాబ్దాలు ,
రాజ్యాంగం రూపకల్పన జరిగి మరెన్నో వసంతాలు,
అయితేనేం! ఇంకా అక్షరాజ్ఞానం అందని అభాగ్యులెందరో !
కనీస సామర్థ్యాలు రాని చిన్నారులు
మరెoదరో!!
కాలం గడిచింది
గమ్యం మిగిలింది కారణాలన్వేషణలో
కనిపించె ఎండమావులెన్నో!
మనసును కదిలించే
మౌనరాగలు మరెన్నో!!
అంతర్ మథనంలో
ఆత్మ శోధనలో గుండె తరుక్కుపోయే కన్నీటి గాధలెన్నో!
కాలచక్రంలో నలిగిపోయిన కాగితాల కథనాలు ఎన్నో మరెన్నో!!
గమ్యం కోసం..
గురువు గా,
జ్ఞాన దాతగా
విద్యా కుసుమాలను వికసింపజేసి
భావి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మనదే,
బంగారు బాట వేయాల్సిన భూలోక దైవం మనమే.
ఉన్నత లక్ష్యం
మహోన్నత ఆశయం
మదినిండా నింపుకొని కళ్ళముందే ఫలితం కనపడేలా
కంకణ బద్ధులమై కళామతల్లి బిడ్డలమై
అడుగు అడుగు ముందుకు వేస్తూ
అక్షర ఉద్యమాన్ని ఆరంభిద్దాం!
కనీస సామర్థ్యల సేద్యం ప్రారంభిద్దాం..!
చదవడం ఒక సుప్రభాతం లా,
రాయడం ఒక భాగవతంలా,
తరగతి సామర్థ్యాలు ఒక గీతోపదేశంలా,
వచ్చు వరకు
సమాజం మెచ్చువరకు
పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిద్దాం! పునరంకితం తో
అనుకున్నది సాధిద్దాం!
-T. భాస్కర్
GHm. ZPHS YEDDUMAILARAM
M:Kandi
🌻🌻🌻🌹🌹🌹