Wednesday, August 7, 2024

friend

🌹🌹🌹🌹🌹🌹నలుగురిని కలుపుకునే తత్వం 
పది మందిలో ఇమిడి పోయే వ్యక్తిత్వం 
సమాజ హితాన్ని ఆశించే సహజత్వం 
మానవత్వం పరిమళించే మనస్తత్వం 
సరదాలా కోసం సాగె 
నేతృత్వం 
ఆత్మీయత పంచే అమ్మలోని లాలిత్యం 

నీలాకాశం లోని నిర్మలత్వమై,
పున్నమి నాటి వెన్నెలై 
చల్లని జాబిల్లి రూపంగా 
అవని పై వాణిగా విచ్చేసి 
అమృత హస్తలను జత చేసి 
ఉమ్మడి కుటుంబంలోకి ఉత్తజంగా ప్రవేశించి 
ఉపాధ్యాయ ఉద్యోగం
అవకాశాన్ని అందిపుచ్చుకొని
వృత్తి పై మక్కువ పెంచుకొని
పసిపాపలల చెలిమి తో 
బాల్యం లోకి తొంగి చూసి 
గీతాంజలి గిరిజ ను మరిపించి
ఫిదా సాయిపల్లవిని తలపించి 
ఎదో తెలియని ప్రత్యేకత కలిగి 
ఎక్కడో మరువని అనుభూతిని మిగిల్చి
జీవనయానం లో యాత్ర తిప్పిన మలుపు 
ప్రయాణం పదనిసలో.., పరిశీలించిన పద్ధతి...!

ఓ ఔన్నత్యంతో తారసపడిన తరుణి తో   
  స్నేహబంధం కావాలని ఉదయించిన ఆపేక్ష..
ఆకాశమంత ఎదిగిఅల్లరి చేస్తుంటే 
స్వచ్చంగా, 
స్వార్థం లేకుండా కొనసాగాలని 
మౌనరాగం మధుర గీతమై 
నీ చెంతకు చేరగా..
సంఘర్షణ లో 
స్నేహ బంధం విరియగా..!
కాలం భవిత చిత్రం గీయగా..!!
🌻🌻🌻🌻🌻🌻

Saturday, July 13, 2024

Smt. D . అనురాధ మేడం SA (PD) గారికి


💐💐💐💐💐
బడి అడుగుల్లో
 బలమైన బంధం వేసి 
అందరికి అనురాగన్ని పంచిన అనురాధమేడం 
అన్నింటా తానై
అందరిలో ఒకరై 
పాఠశాలకు మూడో కన్నై 
విద్యార్థుల వినయనికి కరిగే వెన్నై 
 సంస్కృతి కార్యక్రమాలకు వారధై 
PET గా ఈ బడిలో కొలవై 
 విజేతల బహుమతుల సమూహానికి నెలవై 
 ప్రధానోపాధ్యాయులకు వెన్నంటి నిలిచి 
 ప్రతి పని తనదిగా భావించి
 వైభవంగా గడిచిన పదమూడు ఎళ్ళు 
ఉద్యోగ చరిత్రలో మర్చిపోని మైలురాళ్లు 

మీరు ఈల వేస్తే 
ఎగిరి పడే 
లేగ దూడలు 
మీరు కన్నెర్ర చేస్తే 
కందిపోయే చిగురుటాకులు 
మీ కనుసన్నళ్ళో నడిచే లేత మొలకలు
మీ సాగు లో తరించిన రేపటి పౌరులు 

తప్పు చేసిన వారిని మీదైనా శైలిలో ఒప్పుకునేలా చేసే తంత్రం 
కౌమరం సరియైన బాటలో నడిపించే మంత్రం 
మీకు మాత్రమే సొంతం
మీ  విజయగాధ అనంతం

ఎన్నో అరుదైనా ఘట్టాలకు మూగ సాక్షిగా నిలిచి 
 ఎందరో విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కలిగించి 
 విద్యార్థుల కన్నీటి వీడ్కోలు ను అందుకొని 
కదిలి పోతున్న మీకు 
మా అక్షర సుమాంజలి 
వేదనా భరితమైన కన్నీటి భాష్పాంజలి

-T. భాస్కర్ 
ప్రధానోపాధ్యాయులు 
Zphs తెల్లాపూర్.
🙏🙏🙏🙏🙏

Smt L. మాధవి లత SA Hindi గారికి 💐💐💐💐💐



ద్వితీయ భాష ను 
సులువైన రీతిలో అందించి 
 ఆప్యాయతను అమ్మ లా పంచి 
 ప్రతి విద్యార్థిని ప్రేమతో పలకరించి 
 ప్రతి పనిలో మీ పాత్రను విజయవంతంగా నిర్వర్తించి
సాగిన మీ పాఠశాల సాంగత్యం అజరామరమైనది.
మా విద్యార్థులకది అపురూప మైనది.

మీరు వెళ్లిన  తరగతి నిండు వెన్నెలఆకాశం 
మీరు బోధించిన విద్యార్థులు 
మెరిసే నక్షత్రాల సమూహం 
మీ తరగతి నియంత్రణ 
విద్యార్థుల క్రమశిక్షణ 
గీసిన నమూనా చిత్రం 
 ఆకట్టుకునే రంగుల రాట్నం 
హిందీ కహానీలు 
కబీర్ దోహేలు 
కన్నరపకుండా వినే 
గాయత్రి మంత్రాలు 
 పరభాష అయినా
పరవశం తో పులకించే 
మధుర గీతాలు 
 సంవత్సరాలు 
 విజయవంతంగా
సాగిన విద్యాసాగు 
మీ పనితనానికి నిదర్శనం 
మీ దార్శణికతకు నిలువెత్తు ధర్పణం 

 అలసట లేకుండా 
 అందరిని అలరించిన  గళం 
ఈ పాఠశాలలో మూగబోతుంది 
అందరి మనసులు గెలిచిన మాధవి మేడం మాకందరికీ దూరం కాబోతుంది.
అయినా...!
చెప్పిన పాఠాలు 
చెరగని ముద్రవేసి 
చిరకాలం నిలిచిపోతాయ్ 
 చెరగని నవ్వుగా మిగిలిపోతాయ్
🙏🙏🙏🙏

Wednesday, July 10, 2024

శ్రీమతి కంకిపాటి లలిత (SA తెలుగు) ZPHS తెల్లాపూర్ గారికి ఉద్యోగ విరమణ సందర్భంగా….💐💐💐💐💐💐💐



అమ్మ లోని లాలీత్యం మీ బోధన 
పరిడవిల్లె  పరిపూర్ణత మీ శోధన
 తెలుగు పరిమళాలు వెదజల్లే మీ సాధన
విద్యార్థుల విజయ తీరం మీ యోచన
ఆరాట పడే మీ మనస్తత్వం  భావి తరానికి వంతెన 
మీ సేవతత్పరత  విద్యావ్యవస్థకే  సాంత్వనా..!

 కమ్మని  రుచులతో  
 మధురమైన మాతృభాషను వడ్డించి
 ఆస్వాదించేలా 
 కడుపార ఆరగించేలా
 శ్రమించి సాగిన సేవ
 విద్యార్థుల భాషాభివృద్ధికి అందిన సువర్ణవకాశం
 తెల్లాపూర్ విద్యా చరిత్ర లో మరిచిపోని అధ్యాయం 

 భాషా సంస్కృతి ,బావవ్యక్తికరణ
సత్ప్రవర్తన ,సంప్రదాయ పరిరక్షణ 
విలువలతో కూడిన విద్య
విచక్షణతో కూడిన జీవన గమనము
కలబోసి 
గోరుముద్దలుగా  అందజేసీ
 తెలుగుదననికినిరంతన రక్షనై 
వెలుగొందిన వైనం 
అద్వితీయు  అభినందనీయం.

 తరగతి గదిలోకి మీరు నడిచి వస్తుంటే 
 సరస్వతి విగ్రహం
 కదిలోస్తున్నట్టుగా 
 పద్యాల పఠనం కావిస్తుంటే 
 లలిత సహస్రనామాలు మార్మోగుతున్నట్లుగా 
 విద్యార్థులను పాఠ్యాంశాల్లో  పరీక్షిస్తుంటే 
సమరానికి పురి గొలపుతున్నట్లుగా...
క్రమశిక్షణలో కఠినంగా పలికిన మాటలు
సైనికులను సిద్ధం చేస్తున్నట్లుగా .. 
ప్రేరణ కలిగించిన మీ సుశిక్షణ 
ఆత్మవిశ్వాసం నింపుకుని 
 జీవితమనే కదన రంగంలో 
 గెలుపు ఓటములను సమానంగా స్వీకరించేలా 
తీర్చిదిద్దిన  తీరు
 సువర్ణక్షరాలుగా లిఖిత మైనది ! 
 పలువురు మెచ్చేలా ప్రశంసనీయమైనది !!


- T. భాస్కర్                                      ప్రధానోపాధ్యాయులు                               ZPHS తెల్లాపూర్             రామచంద్రపురం మండలం
🙏🙏🙏🙏🙏🙏

Tuesday, April 30, 2024

ఉగాది 2021

ఉగాది 2021
 ఉగాది ఉషోదయం
 వసంతాన్ని వాకిటపరిచి,
పండగ షడ్రుచులు 
జీవన భాష్యాన్ని
మిళితం చేసి 
 మొడు  బారిన వృక్షాలు 
కొత్త అందాన్ని సంతరించుకొని,
 చివురించిన లేత ఆకులు 
మయూరంలా నర్తిస్తూ 
అవని అందాలను ఆస్వాదిస్తూ తన్మయత్వంతో కోయిల గానం చేస్తూ, చెట్ల పూతలు
 కొమ్మల కాతలు 
కమ్మని వాసన వెరిజిల్లుతూ 
ప్రకృతి రమణీయత పరిడవిల్లి 
సాహిత్య పిపాసకుల మదిలో 
జాలువారే ఆలోచనలు 
కవితా ప్రవాహాన్ని సృష్టిస్తూ
 కన్నులకింపైన కిన్నెరసాని వోలె 
తెలుగు నూతన సంవత్సరం 
నవవధూవు శోభను సంతరించుకొని, తెలుగువారి ఇంటింటా ఆనందపు హరివిల్లును అందిస్తూ 
చేదును అధరాలతో అదిమి
తీయదనాన్ని నోటి నిండా పంచాలని,
 శార్వాణిలా కరోనా మయం కాకుండా ప్లవనం సగటు జీవిని సంతృప్తం చేయాలని సర్వేజనా సుఖినోభవంతు కావాలని ఆశిద్దాం ఆశీర్వచనం కావాలని ప్రార్థిద్దాం

Monday, April 29, 2024

శ్రీ గాజర్ల రమేశ్ DEO గారికి

Date 18-05-2014

ఉన్నత లక్ష్యం 
మహోన్నత ఆశయం 
మమేకమై, మార్గదర్శకమై
 పోషణ లేమితో,పర్యవేక్షణ లోపంతో బుడిబుడి అడుగులతో తడబడుతున్న 
 విద్యా వ్యవస్థకు 
నడక నేర్పి, 
నడవడిక చేర్చి
 పరిగెత్తించాలనే పట్టుదల 
 రాజీ పడలేదు 
రాజకీయ ఒత్తిడికి తలవంచలేదు 
ఫలితం ఊహించిన
 ప్రమాదం అని అంతరంగం హెచ్చరించిన, 
మడమతిప్పని వ్యక్తిత్వం 
పోరాట యోధుని దీరత్వం 
కడలిని తలపించే గాంభీర్యం, అస్తమించడానికి భయపడిన 
భానుడిలా 
మెతుకు సీమలో
 మీ ప్రస్థానం అసమాన్యమైనది
 అనిర్వచనమైంది.

 ప్రమాణాలు పెంచాలి
 ఫలితాలు మెరుగుపడాలి 
పదే పదే పలికిన పిలుపుకు అభినందనలు బదులు అపనిందలు 
సత్కారానికి మారుగా 
వ్యతిరేక పవనాలు..వీచిన,
తిరుగుబాటు జెండా ఎగిరిన 
వ్యక్తిగా మీకు అది శాపం 
వాస్తవానికి అది వ్యవస్థ లోపం..

 మొక్కవోని కర్తవ్య దీక్ష 
అధికార దుర్వినియోగానికి నిస్తేజమై 
బదిలీ బాణంతో 
బడుగు వర్గాల సేవకు 
తాత్కాలికంగా దూరమైనా 
ఆదర్శ అవ్వాలి మీకు..!
 నిబద్దతోకూడిన పూనమ్ మేడం 
విధి నిర్వహణ 
సవాల్ స్వీకరించే 
స్మిత మేడం కర్తవ్య బోధన
  
మబ్బులు పట్టిన 
చంద్రుని వెన్నెల తరగదు 
అవరోధాలు ఎన్ని వచ్చినా 
విజయుని కాంక్ష మారదు 
మీరు మీరు గానే ఉండి
పని రాక్షసత్వాన్ని సజీవంగా నిలిపి 
కలసి రాని కాలంలో కూడా 
మీ నిష్ఠత 
నిర్వీర్యం కాకుండా 
విద్యా వ్యవస్థను 
బ్రతికివ్వడానికి
 మీరు వేసే ప్రతి అడుగు...
 తెలంగాణ రాష్ట్రానికి
 వెలుగు రేఖల నింపాలి 
సదా భగవంతుడు 
మీ కుటుంబాన్ని ఆనందంతో,
విజయం వర్ధిల్లెలా 
ఆశీర్వదించాలని, 
ఆశీస్సులు అందించాలని 
సదా మీ విజయాన్ని 
మనస్ఫూర్తిగా కోరుకునే..

-T. భాస్కర్ HM
Zphs సికిందర్ పూర్ మండల హత్నూర

Tuesday, April 2, 2024

జీవితం

కొన్ని జ్ఞాపకాలు..!
మస్తిష్క సాగరం లో
సునామి లా పెను ప్రకంపనలు సృష్టిస్థాయి,

కొన్ని స్మృతులు..!
మధ్యరాత్రి మగత లో 
వేదన వలయాలై 
కన్నీటి జలపాతానికి       
  జీవం పోస్తాయి,

కొన్ని అనుబంధాలు..!
హృదయంతరాలలో
లావ లా పెల్లుబికి
విషాదాన్ని మిగులుస్తాయి

కొన్ని గెలుపు ఓటములు..!
జీవితమనే ఆటలో
మోదాన్ని ఖేదాన్ని ఆవిష్కరిస్తాయి

జీవితమంటేనే ఇంత..
ఎత్తు పల్లాలను
ఎక్కుతూ..
జారుతూ...!
విషదాన్ని మింగేస్తూ 
ఆనందాన్ని ఆస్వాదిస్తూ 
కన్నీటిని జారుస్తూ
కడలిని ఈదేస్తూ..
కనురెప్పలు మూసేవరకు సాగె ప్రయాణం..!!
😞😞😞😊😊😊
🌹🌹🌹🌹🌹🌹

Sunday, March 31, 2024

Rudrappa retirement

పేరులో రౌద్రం వ్యక్తిత్వంలో సౌమ్యం 
 బోధన లో గణితం 
 బాధ్యత లో ఆదర్శం
 భావి భారతీయుల నిర్మాణంలో 
 సిపాయిని తలపించే సేవాతత్వం 
విద్యార్థులు ఉన్నతికి అనుక్షణం తపించే  మనస్తత్వం
కలబోసి కళ్ళేదుట కనిపించే శంకర నాదం
 కరుణామూర్తిగా, నిష్కపటదారీగా, వివాదరహితుడిగా 
హోమ నిర్వాహకుడిగా
 విద్యా తపస్విగా
 పలు పాత్రల్లో అభినయ తాండవుడిగా అజరామరమైన 
మీ ఉద్యోగ ప్రస్థానం
 నిలుస్తుంది 
విద్యా రంగంలో ఒక చరిత్రగా ..!
 మిగులుతుంది
 విద్యార్థుల హృదయాల్లో
 చెరగని ముద్రగా..!!
Wish u a happy retirement sir
💐💐💐💐💐

Tuesday, March 19, 2024

త్యాగం

👑"మహిళమణి"🌞

ఆకాశమంత ప్రేమను
మది నిండా నింపుకొని,
అమ్మ లోని అనురాగాన్ని గుండెనిండా పరుచుకొని,
అనుక్షణం ఆలోచన లన్ని
బాబా చుట్టూ అల్లుకొని,
త్యాగానికి తానే ఒక నిఘంటువు గా,
ఆత్మీయత ను నిత్య ప్రసాదంగా,
ఆర్ద్రత కు ఆలవాలమై, ఆరాధనే నిత్యం కొలువై,
కంటి నిండ కునుకు లేకున్నా,
కన్నీటి చుక్కలు ఆగక కారుతూనె వున్న,
కూని రాగాలతో ఊహాలోకం లో విహరించిన,
సంతోషం తో ముఖారవిందం చంద్రబింబం ఐన,

నీ జీవితం.., నీ కలల ప్రపంచం...,

భానుడి కాంతుల హరివిల్లు!
బాబా దీవెనల పొదరిల్లు!!
🌺🌸🌹🌼

Monday, March 4, 2024

బదిలి వీడ్కోలు

రాజుపాలెం రమ మేడం గారి 
9 వసంతాల పాలనా
అందరు మెచ్చిన ఆలనా
తరిగిపోని తల్లీలోని లాలన

 అక్షర యజ్ఞం లో 
అహర్నిశలు శ్రమించి
వసతుల పెంపుకై
వడి వడి గా లక్ష్యం వైపు ప్రయాణించి
నిన్న కు, నేటికీ
నిజమైన
అంతరం సృష్టించి
విద్యా శాఖలో దేవి గా
అవతరించి
వేనోళ్ల పొగడ్తలకు
వేదికై
విజయ తీరాలు చేరిన
మీ గమ్యం హర్షనీయం 
మీ గమనం ఆదర్శం.

విద్యావనం లో
మీరు ప్రతిష్టించిన సరస్వతి స్వరూపం
ప్రంగాణ పరిధికే శోభయమనం
మీరు నిర్మింపజేసిన
తరగతుల విశాల భవనం
తెల్లాపూర్ కే తలమాణికం
విద్యార్థులను అన్నిరంగాల్లో ప్రోత్సహించిన తీరు
నిలిచి పోతుంది చరిత్ర లో
నింగి నేల ఉన్నంత వరకు...
పంచభూతాలు పరిసమాప్తమయ్యే వరకు..


విధి నిర్వహణలో బడి నీ విడిచి వెళ్లిన
విధి రాతను కాలం మార్చలేకపోయినా  పిల్లల జ్ఞాపకాలు,
తరగతి గదుల మధుర స్మృతులు
మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.
మనసులో తియ్యని అనుభూతుల దొంతరాలు కదులుతూనే ఉంటాయి.

బదిలీ లో ఈ బడిని వదిలిపెట్టిన
స్థాన చలనం సాంగత్యాన్ని దూరం చేసిన 
ఆజన్మంతం రుణ పడివుంటుంది.
అన్ని వేళల తోడై అండగా నిలుస్తుంది 

మీ సేవలె ఆశీస్సులై
మీ విధి నిర్వహనే వేదమాంత్రలై..
ఆకాక్షిస్తుంది 
మీ శేష జీవితం ఆనందంగా గడవాలని
మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని..