🌹🌻🌹🌻🌹🌻
తొలి మెట్టుతో..
మౌలిక సామర్థ్యాలకు శ్రీకారం,
ప్రణాళికతో..
అభ్యసన ఫలితాలకు నిర్ధిష్ట ఆకారం,
లయ తప్పిన జాతీయ విద్యా విధానం
లక్ష్యసాధన లో రాణించని రాష్ట్రీయ విద్యా విభాగం,
రెంటికి నడుమ
త్రిశంకు స్వర్గం లో కొట్టుమిట్టాడె
సమస్య ల సుడి లో ఉపాధ్యాయ లోకం,
నిత్యం అధికారులకు అందించే లెక్కలతో
కుస్తీ చేసే బడి సమయం,
ఎన్నెన్నో..... స్కీం లు
ఎన్నెన్నో..... శిక్షణలు
కళ్ళముందే కదలి
వెడుతూ,
కనిపించని ఫలితాలు
వినిపించె మొక్కుబడి గీతాలు
అంతర్మదనంలో..
అన్వేషణ లో...
పాలకుల..!
బోధకుల..!!
కారకులెవరని
ఎటుతేల్చుకొలేని వైనం
సంధిగ్ధం లో విద్యా గమనం,
అక్షర ప్రమిద
మినుకు మినుకు మంటు..
కఠిన పరీక్షలో
కష్ట కాలం
ఎదుర్కొంటూ
కనీస పరిజ్ఞానానికి నోచుకోక
నిస్తేజంగా నింగి వైపు అమాయకంగా చూసే చిన్నారుల... బేలచూపులు,
తామేం కోల్పోతున్నామో
గుర్తెరుగని లేతప్రాయం లో విధి వంచితులు,
చదువుల సాంద్రత తెలియని పోషకుల
అపరిపక్వ ఆలోచనలలో..!
దృష్టి సారించి
లోతుగా ఆలోచిస్తే
గుండె తరుక్కుపోయే
బ్రతుకు చిత్రం,
మనసు బరువెక్కే
మౌన గాత్రం,
మీమాంస లో పడేసే
మేధావుల ఘణoకాలు,
తల దించుకునేలా NAS ఫలితాలు,
కారణం మేముకాదంటూ
పక్కవైపు వేలెత్తి చూపే
సమాజ నైజం,
తన తప్పును పరుల పై తోసే
మానవతత్వం,
సమిష్టగా సమస్యల
తోరణాలు
విద్యా రంగం లో
అవరోధాలై..
అలజడి సృష్టిస్తూ..!
బంగారు బాల్యన్ని
ప్రయోజకతకు
దూరం చేసి
అంకిత లేమి తో
అనాలోచిత నిర్ణయాలు,
పేదరికానికి చేరువ చేసి
అంతు చిక్కని వింత రోగం
విద్యా క్షిణతకు కారణమవుతూ,
సరస్వతి కన్నుల్లో
నీటి సుడులు ప్రవహింపజేస్తూ..
మౌనరోధన మనసుని తాకి
మరుగున ఉన్న మనో వేదన
అరణ్య రోదనగా మారి
విద్యా వ్యవస్థకు
ముసురులు కమ్మిన వేళ..!
అలుపెరుగని స్వేదం
వృధాకాని సమయం
జ్ఞాన జ్వాలకు తరగతి కేంద్రం
సమూన్నత స్థాయికి విద్యా యజ్ఞం
అజాదిక అమృత్ మహోత్సవ్ సాక్షిగా
స్వాతంత్రo సాధించిన పోరాట స్ఫూర్తిగా
చదువుల కోవెలలో
అంకితమనే దీపం వెలిగించి
చిన్నారుల మోమునా
చిరునవ్వులు పూయించి
విధి విరమణ రోజు సగర్వoగా తలెత్తుకు బడి వైపు విజయహాసం తో
చూసే స్థితి లో మనముండాలని
FLN ప్రేరణ గా మనమంతా ముందుకు సాగాలని..!
విద్యా విజయ
శంఖారావం పూరించాలని...!!
- T. భాస్కర్
ప్రధానోపాధ్యాయులు
ZPHS ఎద్దుమైలారం
మం: కంది.🙏🙏