Saturday, July 25, 2020

కోవిడ్

💐💐💐💐💐
😞😞😞
ఇరువై ఇరువై 
కోవిడ్  మయమై 
జీవితం బరువై
కన్నీటి చెరువై
అలుముకున్న విషాదఛాయలు
ఆరిపోతున్న కుటుంబ దీపాలు. 

మాయరోగం  వచ్చిందని,
మనుగడే ఇక లేదని,
గుండె లోతుల్లో గుబులు మొదలై,               
 మస్తిష్కం లో ఆందోళన
ఆరంభమై ,
ఊపిరి ఆడక 
ఉక్కిరి బిక్కిరై,
 కంటిముందు నుండి కనుమరుగై , 
కానరాని లోకాలకు చేరువై
మరొక ప్రాణం మట్టిలో కలిసింది.
మదినిండ కలతను నింపింది.

కుటుంబాల్ని కూలదోసి,
ఆర్థికవ్యవస్థ ను ఆగం చేసి,
మానవ సంబంధాల్ని మంటకలిపి,
ప్రపంచాన్ని భయం గుప్పిట బంధించి,
మరిచిపోలేని చేదు జ్ఞాపకాల్ని మిగిల్చేసి,
కడ తేరిన వారిని కడచూపుకు కూడా నోచు కోనివ్వక,
నాలుగు గోడలమద్యే  నరకయాతన అనుభవించేలా,
కర్కశంగా శాసిస్తున్న
కరోనా రక్కసి.!

కాలనాగుల బుసకొడుతూ,
కరుణ లేకుండా
కనికరం చూపకుండా
రాస్తున్న విషాద ఘట్టంలో,
కన్నీటి వ్యథ లెన్నో!  
 కలం చేరనికథలు మరెన్నో!!
😢😢😥😥

T.భాస్కర్ ప్రధానోపాధ్యాయులు.ZPHS. ఎద్దుమైలారం.

Wednesday, April 29, 2020

పుష్పాంజలి

🌻🌷పుష్పాంజలి🌺🌹

ధవళ  వస్రాలు ధరించి,
అవిశ్రాంత సేవలు అందించి,
ప్రాణాలకు తెగించి, ప్రాణవాయువు  నందించి,
కరోనా బారిన పడకండా,
కనురెప్ప వాల్చకుండా కష్టించే ప్రాణ దాతలు,
ధరణి లో దేవతలై, మదర్ థెరీసా వారసులై,
బాధితులకు భరోసా నిలుస్తున్న మీకు, వందనాలు పాదాభివందనాలు.

కరోనా కట్టడి కర్తవ్యంగా
సామాజిక దూరమే ప్రయత్నంగా,
మనం రోడ్డున పడకుండా,
రోజంతా శ్రమిస్తూ,
కుటుంబాన్ని వదిలి, రాత్రింబవళ్ళు సంచరిస్తూ,
ముసుగు ధరించమని
గడప దాటోద్దని,
చేతులు జోడిస్తూ,
లాఠీని ఝలిపిస్తూ,
అలుపెరుగని పోలిసన్నా,
 అందుకో జోహార్లన్నా!

Wednesday, April 8, 2020

కరోనా

.       కరోనా

మానవాళి మనుగడ ను ప్రశ్నిస్తున్న మహోత్పాతం,
ప్రపంచాన్ని భయం గుప్పెట్లో బంధిస్తు  
 విషం చిమ్ముతున్న ఉన్మాదం,
అగ్రరాజ్యాలకు అంతుచిక్కని మహమ్మారి మారణహోమం,
ఖండాంతరాల ను దాటి కర్కశంగా కాటేస్తున్న మారణాయుధం,

విశ్వాన్ని శాసించే సాంకేతికతను సాగర గర్భంలో కలిపేసి,
భూతల స్వర్గాన్ని సృష్టించే అధునాతనాన్నీ అధః పాతాళానికి తోక్కేసి,
కనికరించక..కనిపించని కోవిడ్ గా  
గొంతునులిమి శ్వాస నదిమి,
నిరంతర వైద్య సేవల్ని నిర్వీర్యం చేస్తు,
మానవ సంబంధాల్ని మాయం చేస్తూ, 
వేల ప్రాణాల్ని అలవోకగా హరించేస్తు,
మరణమృదంగం తో కరాళనృత్యం  చేస్తూ,
ఉదృతి గా నలుదిశలా విజృంభిస్తున్న కరోనా..!

కట్టడి చేస్తాం నిన్ను.. స్వియ నియంత్రణ ను స్వీకరించి, అంతమొందిస్తాం.. వ్యక్తిగత పరిశభ్రత ను ఆచరించి,
సాగనంపుతాం..
సామాజిక దూరాన్ని స్వాగతించి,
నిన్ను సమాధి చేస్తాం..
 అసేతు హిమాచలం సంఘటితమై!
-T భాస్కర్ Hm 
Zphs yeddumailaram

విశాల వదనం

"విశాల"వదనం
    🌹🌸🌼
బాపు గీసిన బొమ్మ కన్నా.. మనోహరం,
బాలు పాడిన పాట కన్నా.. మాధుర్యం, సుబ్బలక్ష్మి సుప్రభాతం లోని తియ్యదనం,
వేటూరి రచనలోని చాతుర్యం, 
వసంతం పరచిన సొగసును,
జాబిల్లి విరిచిన వెన్నెలను,
 కలబోసి....,
నెమలి పింఛం లాంటి నయనాలు,అధరాలపై   కొలువు తీరిన నిటారైన నాసిక, నయాగరా జలపాతాన్ని  
తలపే ..వాలుజడ,
అజంతా శిల్పంగా.., పికాసో చిత్రంగా.., అందమైన మనసున్న సుందర రూపం ,
హిమాలయాల అంత ఎత్తైన వ్యక్తిత్వం, వృత్తిలో నిర్వహణ ఆదరణతో కూడిన దైవత్వం,
అనునిత్యంసాగే
 నీ ఆలోచనలు ..
సమాజ హితం,
అందుకే..
అభిమాన పుష్పాంజలి!
అభినందనల భాష్పంజలి!!
🌈🦋👑

Sunday, March 15, 2020

యువత

కెరటం లా ఎగిసిపడే భావోద్వేగం
అశ్వం లా పరుగెత్తే రుధిర ప్రవాహం
విశ్వాన్ని జయీoచాలనే ఆలోచనాతత్వం
విజేత గా నిలువ గలిగే ధీరత్వం
సాధనలో అవరోధాలను ఎదురించే తత్వం,
యువత గా ఇది మీ తనువందలి
ప్రకృతి సత్యం

Monday, February 17, 2020

అభినయ్ పుట్టిన రోజు

"అభినయా"నికి నయా గీతం,
అల్లరి తో నిత్య సంగీతం,

వేకువ తొ వెల్లివిరిసే మాటల సుప్రభాతం,
స్వచ్చమైన దరహాసం తో మొదలయ్యే  శుభోదయం,

ప్రతి నిమిషం ఇళ్లంతా సందడిమయం,
నిశబ్దాన్ని చేదించే బాల్యపు కొంటెతనం,

ఆత్మీయత తో అలరించే చిలిపితనం,
అందరినీ పలకరించే మంచితనం,

అవరోధాన్ని అధికమించే ఆత్మవిశ్వాసం,
అలక వీడి కలిసిపోయే కలుపు గొలుతనం,

అనుకున్నది సాధించాలనే మనస్తత్వం,
అందరిని ఆదరించే మానవత్వం,

దేవుడి  ధీవెనల తో అందమైన భవితవ్యం
అందాలని కోరుకునే కుటుంబం..!

అందిస్తుంది..
🎂🍮
"పుట్టిన రోజు శభాకాంక్షలు"

Wednesday, February 12, 2020

"మహిళమణి"

👑"మహిళమణి"🌞

ఆకాశమంత ప్రేమను
మది నిండా నింపుకొని,
అమ్మ లోని అనురాగాన్ని గుండెనిండా పరుచుకొని,
అనుక్షణం ఆలోచన లన్ని
బాబా చుట్టూ అల్లుకొని,
త్యాగానికి తానే ఒక నిఘంటువు గా,
ఆత్మీయత ను నిత్య ప్రసాదంగా,
ఆర్ద్రత కు ఆలవాలమై, ఆరాధనే నిత్యం కొలువై,
కంటి నిండ కునుకు లేకున్నా,
కన్నీటి చుక్కలు ఆగక కారుతూనె వున్న,
కూని రాగాలతో ఊహాలోకం లో విహరించిన,
సంతోషం తో ముఖారవిందం చంద్రబింబం ఐన,

నీ జీవితం.., నీ కలల ప్రపంచం...,

భానుడి కాంతుల హరివిల్లు!
బాబా దీవెనల పొదరిల్లు!!
🌺🌸🌹🌼

Thursday, February 6, 2020

వేదన

కారు చీకట్లు చేధించిన కాంతి రేఖలు..
కొత్త ఉత్సాహాన్ని ఊరించి..!
కనుమరుగైన సంధ్యా కాంతులు...
నిలువెల్లా నైరాశ్యం ఆవహించి...!!
కదలి రాని,కరిగిరాని చెలియ మౌనం..
ఎడబాటు వెలితి తో అలుముకున్న మౌన రోదన..!
కనుచూపు కైన
కానరాకూడదనే కాటిన్యం..
గుండె లోతుల్లో గుచ్చుకున్న 
నరక యాతన..!
ఉప్పెన లా ఉబికి వచ్చు ఉద్వేగం..
కన్నిటిధార లో మసక బారిన 
నిత్య శోధన..! 
కుంగుబాటు కౌగిలి లో
ఎడారి తలపించే జీవనయానం..
ఎందరు ఉన్నా ఒంటరితనం వేధిస్తూ
జీవన సాధన..!

ఎదురుచూపు లో అలసిపోయి ఆవిరైనాఆశల 
ఎండమావులు,
గుండె ఘోష లో
 పేక మేడల కూలిన ఊహ చిత్రాలు ,
జ్ఞాపకాల అలల ధాటికి 
తడిసిపోయిన కలల తీరాలు,
బ్రతుకు బాటలో కర్పూరం ల కరిగిపోయిన కాలం
కడకు మిగిల్చిన కడు చేదు నిజం.

Wednesday, February 5, 2020

జలఘోష


జనం గుండెల్లో జల ఘోష 
వేదనగా మారుతున్నది 
జలంతో పులకరించాలసిన పుడమి రోదనలతో వణుకుతున్న ది 
జీవం మనుగడకు
మూలమైన ప్రాణాధారం కనుమరుగవుతున్నది,
దరిత్రి  నీటి ఎద్దడితో
నిర్జల ఆవాసంగా మిగులుతున్నది
వెంచర్ పేరిట హరిత
వనాన్ని ని హరించి 
పారిశ్రామీకరణ తో 
పంచభూతాలను మాలిన్యం చేసి , చల్లగా తేలియాడే నల్లటి మేఘాలు ,పుడమి పులకరించే వర్షపు జల్లులు కానరాకుండా కనుమరుగుకు కారణమవుతూ,
 ఆకాశాన్నంటే కాంక్రీట్ భవంతుల అవసర నిమిత్తంమై
 పాతాళంలోని తేమను  పైకి తోడాలని, బోరు కత్తులతో
 ధరణి తనువంతా గాయం చేసి ,
సుడులు తిరిగే రాతి దుమ్ముతో 
కరగని రాతి కొండల్ని 
రాలని నీటి బిందువుల్ని 
పరికిస్తు ఫలితాలను అనుభవిస్తూ ఉక్కిరి బిక్కిరై ఊపిరి అందక
 వినిపించే సునామి ప్రకంపనలను గర్జించే భూకంపాల  ఆర్తనాదాలకు కారకుడవు నీవేనని గుర్తించు, 
మనుగడ ముప్పని  గుర్తించు ఫలితాన్నిచ్చే ..
ప్రత్యామ్నాయాలపై అన్వేషించు
 పచ్చని చెట్లు 
పర్యావరణాన్ని రక్షించుటకై 
ఇంటింటా ఇంకుడు గుంతలను నిర్మించి వర్షపు నీరు ఇంకుటకై అహర్నిశలు శ్రమించు!!

వానమ్మా


వానమ్మ ఇది నీ కరుణమ్మా 
 జీవకోటి కిఇది నీ వరమమ్మా, 
ఆకాశం ఆనందం తో అందమైన హరివిల్లై మెరుపులతో మురిపాన్ని మబ్బుల మాటున తెలపగా, 
వానమ్మ!!
 తేమ ను తాకిన మట్టిలోని బీజం  రాజసంగా తలెత్తుకొని తొలి అడుగులతో తొణికిసలాడగా 
వానమ్మ !!
వానలు వరదలతో  పుడమి పులకరించి అన్నదాత హర్షించగ  సుజలాం సుఫలాం సమస్త జీవరాశి సంతోషించగ
 వానమ్మ!!

శంఖారావం

🌺🌸🌻🌼               
 
ప్రలోభాలకు అతీతంగా,
కులాల కుళ్లుకు దూరంగా,
సమర్థతకు పట్టం కట్టి,
స్వచ్ఛతకు అద్దం పట్టి
పుర పోరుకు పూరించు
నీ ఓటు శంఖారావం,
నగర నయా రూపానికి,
నిర్మించు విజయ ద్వారం.
🌹🌼🌸🌻

Saturday, February 1, 2020

జీవనయానం


జీవనయానం🌹

కదిలే కాల గమనం
కలిసే వైవిధ్యమైన కరచలనం,
ఎన్నో అనుభవాలు..
ఎన్నో అనుభూతులు..
ఎన్నో జ్ఞాపకాలు..
ఎన్నో ఊహించని మలుపులు...,
మనం వదులుకునేవరు  కొందరు
మనల్ని విడిచి వెళ్ళేవారు మరి కొందరు
ఎవరికోసం ఏది ఆగదు
నిన్నటి కోసం ఏది నిలువదు,
గతాన్ని తలచి వలచడం!
వర్తమానాన్ని మసక బారెలా మార్చడం !!
అంతర్ముఖుని దైనందికం 

"నల్లగా మారిన మేఘాలు
వర్షించక ఆగవు.
మబ్బులు తొలిగిన భానుడు
ఉదయించక మానడు 
జీవితమంటే సమస్యల సుడిగుండం
మునిగి పోతమనే  భయాన్ని వెనెక్కి తోసి
తీరం చేరాలనే ప్రయత్నం తీవ్రం చేసి
నవ్విన వారికి విజయహసాన్ని బదులుగా
అధిరోహనని అడ్డు కోవాలనే వారికీ
శిఖర పతాకo తొ శంఖారావం పూరింంచి
నీవన్నది నిరూపించు
నీకున్నది ప్రదర్శించు 


 

Tuesday, January 28, 2020

ప్రేరణ

మీ "ప్రశాంత"మైన  అంతరంగం లోని ఆలోచన తరంగాలు,
జాలువారే జలపాతంలా తెరమీద 
తీయగా కదులుతుంటే,
కనురెప్ప వాల్చని నయనాలు కాలాన్ని మరిచి ,
కమనీయ దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తుంటే,
 జీవిత అనుభవాలు ,
సామాజిక సేవ కథనాలు..,
కలబోసి వ్యక్తిత్వ వికాస పాఠాలు గా
భగవత్ గీత ను తలపిస్తూంటే..
ఆదర్శమైన ప్రేరణ అందిపుచ్చుకొని
అనుభవాలకు అక్షర మాలను అల్లుతూ
"ప్రతిబింబం" గా పదికాలాలు పదిలపరచుకోవలనే ఆలోచన 
అందిన్చిన  మీకూ కృతజ్ఞతలు.
🙏🙏🙏🙏🙏