Wednesday, August 6, 2025

గలగల పారేటి గంగమ్మవి, 
 జలజల రాలేటి జేజమ్మవి, 
బాధ్యత నిర్వహణలో బహురూపివి,
ప్రేమను కురిపించడం లో అమృత మూర్తివి,
ప్రణయం లో పదనిసలొలికే ఆమనివి,
అమరికలు లేక అందరిలో కలిసిపోయే మల్లెతీగవి,
 మొడుబారిన జీవితాల్లో మురిపాలు పూయించే జాబిల్లివి,
సాంగత్యపు సరిగమలు పరిమళింప చేసే సహచరినివి,
మధుర సంగీతం లో మనసు మైమరిచే తీయ్యని జ్ఞాపకానివి,
 ఆల్చిప్పలో పడిన వాన చినుకువైన "స్వాతి"ముత్యానివి.

Wednesday, July 9, 2025

ఆశల పల్లకి

ఆశతో ఆనందం
నిరాశతో నిరుత్సాహం
అవగింజంత అభిమానం
ఆకాశమంత ఎత్తు ఎదిగి
హరివిల్లు లా రంగుల మయమై
రేపటి రోజును పూలవాన లా ఊహించుకొని మగత నిద్రలో నిద్రిస్తూ...
కురుస్తున్న రాళ్ళ వర్షం ను 
కరిగిపోయిన కలను
 చెదిరిపోయిన సప్త వర్ణాల చిత్రాన్ని
అవలోకిస్తూ.. ఆవేదన..
చెందుతూ

రమాదేవి farewell

రాజుపాలెం రమ మేడం గారి 
9 వసంతాల పాలనా
అందరు మెచ్చిన ఆలనా
తరిగిపోని తల్లీలోని లాలన

 అక్షర యజ్ఞం లో 
అహర్నిశలు శ్రమించి
వసతుల పెంపుకై
వడి వడి గా లక్ష్యం వైపు ప్రయాణించి
నిన్న కు, నేటికీ
నిజమైన
అంతరం సృష్టించి
విద్యా శాఖలో దేవి గా
అవతరించి
వేనోళ్ల పొగడ్తలకు
వేదికై
విజయ తీరాలు చేరిన
మీ గమ్యం హర్షనీయం 
మీ గమనం ఆదర్శం.

విద్యావనం లో
మీరు ప్రతిష్టించిన సరస్వతి స్వరూపం
ప్రంగాణ పరిధికే శోభయమనం
మీరు నిర్మింపజేసిన
తరగతుల విశాల భవనం
తెల్లాపూర్ కే తలమాణికం
విద్యార్థులను అన్నిరంగాల్లో ప్రోత్సహించిన తీరు
నిలిచి పోతుంది చరిత్ర లో
నింగి నేల ఉన్నంత వరకు...
పంచభూతాలు పరిసమాప్తమయ్యే వరకు..


విధి నిర్వహణలో బడి నీ విడిచి వెళ్లిన
విధి రాతను కాలం మార్చలేకపోయినా  పిల్లల జ్ఞాపకాలు,
తరగతి గదుల మధుర స్మృతులు
మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.
మనసులో తియ్యని అనుభూతుల దొంతరాలు కదులుతూనే ఉంటాయి.

బదిలీ లో ఈ బడిని వదిలిపెట్టిన
స్థాన చలనం సాంగత్యాన్ని దూరం చేసిన 
ఆజన్మంతం రుణ పడివుంటుంది.
అన్ని వేళల తోడై అండగా నిలుస్తుంది 

మీ సేవలె ఆశీస్సులై
మీ విధి నిర్వహనే వేదమాంత్రలై..
ఆకాక్షిస్తుంది 
మీ శేష జీవితం ఆనందంగా గడవాలని
మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని..!
-టి. భాస్కర్ HM
ZPHS తెల్లాపూర్.