శ్రద్ధాంజలి
💐💐💐💐
😞😞😞😞
ఆకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదం..
అనుబంధాల ఆలయాన్ని
భూకంప శిథిలాలుగా మార్చేసి,
పచ్చగా విరబూసిన చెట్టు
విధి విష వలయం లో
మొడుబారిన మొదుగై,
అల్లుకున్న ఆశల పందిరి చెదిరిపోయి..!
జ్ఞాపకాల చిత్రం లో చేరిపోయి..!!
ఆవిరైన యువ ఉజ్వల భవిష్యత్తు..!
మనసు పై మానని గాయాన్ని వదిలేసి..!!
ఎదలో చితి మంటను రాజేసి,
ఎదలోతుల్లో
ఎగిసిపడే ఉద్వేగం,
ఎగదన్నుకు వస్తున్న
విధి పై విద్వేషం..
కరిగిన కలను
కనుమరుగైన
యువ ను
కారుతున్న కన్నీటి ధారను
నియంత్రించలేక
నిరోధించలేక
కన్నా రూపం
కళ్ల ముందే
కదలాడుతుంటే, గుండెలవిసేలా మాతృమూర్తి మనసురోధన,
దిక్కులు పిక్కటిల్లెలా
అమ్మ ఆక్రందన...,
కనికరం లేని విధి
కర్కషంగా కన్నీటి
గాథ నే రచిస్తే..!
కాలం కలిసి రాకున్నా
చలించకుండా నిలబడే ధైర్యం లేకున్నా..,
రేపటి ఆశతో
రోహిత్ ఆశయం తో..
నడవాలి ముందుకు...!
సాగాలి సేవకు..!!.
🙏🙏🙏🙏