Wednesday, April 29, 2020

పుష్పాంజలి

🌻🌷పుష్పాంజలి🌺🌹

ధవళ  వస్రాలు ధరించి,
అవిశ్రాంత సేవలు అందించి,
ప్రాణాలకు తెగించి, ప్రాణవాయువు  నందించి,
కరోనా బారిన పడకండా,
కనురెప్ప వాల్చకుండా కష్టించే ప్రాణ దాతలు,
ధరణి లో దేవతలై, మదర్ థెరీసా వారసులై,
బాధితులకు భరోసా నిలుస్తున్న మీకు, వందనాలు పాదాభివందనాలు.

కరోనా కట్టడి కర్తవ్యంగా
సామాజిక దూరమే ప్రయత్నంగా,
మనం రోడ్డున పడకుండా,
రోజంతా శ్రమిస్తూ,
కుటుంబాన్ని వదిలి, రాత్రింబవళ్ళు సంచరిస్తూ,
ముసుగు ధరించమని
గడప దాటోద్దని,
చేతులు జోడిస్తూ,
లాఠీని ఝలిపిస్తూ,
అలుపెరుగని పోలిసన్నా,
 అందుకో జోహార్లన్నా!

Wednesday, April 8, 2020

కరోనా

.       కరోనా

మానవాళి మనుగడ ను ప్రశ్నిస్తున్న మహోత్పాతం,
ప్రపంచాన్ని భయం గుప్పెట్లో బంధిస్తు  
 విషం చిమ్ముతున్న ఉన్మాదం,
అగ్రరాజ్యాలకు అంతుచిక్కని మహమ్మారి మారణహోమం,
ఖండాంతరాల ను దాటి కర్కశంగా కాటేస్తున్న మారణాయుధం,

విశ్వాన్ని శాసించే సాంకేతికతను సాగర గర్భంలో కలిపేసి,
భూతల స్వర్గాన్ని సృష్టించే అధునాతనాన్నీ అధః పాతాళానికి తోక్కేసి,
కనికరించక..కనిపించని కోవిడ్ గా  
గొంతునులిమి శ్వాస నదిమి,
నిరంతర వైద్య సేవల్ని నిర్వీర్యం చేస్తు,
మానవ సంబంధాల్ని మాయం చేస్తూ, 
వేల ప్రాణాల్ని అలవోకగా హరించేస్తు,
మరణమృదంగం తో కరాళనృత్యం  చేస్తూ,
ఉదృతి గా నలుదిశలా విజృంభిస్తున్న కరోనా..!

కట్టడి చేస్తాం నిన్ను.. స్వియ నియంత్రణ ను స్వీకరించి, అంతమొందిస్తాం.. వ్యక్తిగత పరిశభ్రత ను ఆచరించి,
సాగనంపుతాం..
సామాజిక దూరాన్ని స్వాగతించి,
నిన్ను సమాధి చేస్తాం..
 అసేతు హిమాచలం సంఘటితమై!
-T భాస్కర్ Hm 
Zphs yeddumailaram

విశాల వదనం

"విశాల"వదనం
    🌹🌸🌼
బాపు గీసిన బొమ్మ కన్నా.. మనోహరం,
బాలు పాడిన పాట కన్నా.. మాధుర్యం, సుబ్బలక్ష్మి సుప్రభాతం లోని తియ్యదనం,
వేటూరి రచనలోని చాతుర్యం, 
వసంతం పరచిన సొగసును,
జాబిల్లి విరిచిన వెన్నెలను,
 కలబోసి....,
నెమలి పింఛం లాంటి నయనాలు,అధరాలపై   కొలువు తీరిన నిటారైన నాసిక, నయాగరా జలపాతాన్ని  
తలపే ..వాలుజడ,
అజంతా శిల్పంగా.., పికాసో చిత్రంగా.., అందమైన మనసున్న సుందర రూపం ,
హిమాలయాల అంత ఎత్తైన వ్యక్తిత్వం, వృత్తిలో నిర్వహణ ఆదరణతో కూడిన దైవత్వం,
అనునిత్యంసాగే
 నీ ఆలోచనలు ..
సమాజ హితం,
అందుకే..
అభిమాన పుష్పాంజలి!
అభినందనల భాష్పంజలి!!
🌈🦋👑