రోహిణి కార్తీ ఆరంభమై
రోకళ్ళు పగిలి,
వసుధ నెర్రెలు బారి వడలి,వలచే వేళ..!
భానుడి భగభగకు
ధరణి అగ్నికీలగా మారి కాలు బయట కదపడానికి కనికరించని
గ్రీష్మ కాలపు గుర్తులు
జ్ఞప్తి కొచ్చే వేళ ..!
వేకువనే వేడిమి మొదలై కొలిముల కుంపటిగా కొలువై
తరంగాలుగా విస్తరించే వేసవి సెగలు..!
గూడును వదలని గువ్వలు
ఉదక దాహర్తి తీరక
తడారని గొంతులు
జీవపదార్థం నిర్జలమై
ఊపిరాగే ప్రాణులు ఆదిత్యుడి వీర ప్రతాపం కనులెదుటే
కనిపించే వేళ..!
ఎండతీవ్రతకు
మాడులు వేడై
వేడి గాలులు తోడై
గుండె లయలు
వడదెబ్బతో
గాడి తప్పగా,
స్వేదగ్రంధులు చెమటోడ్చి సోమ్మసిల్లగా
ఉక్కపోత తో
ఉక్కిబిక్కిరై
విలవిలలాడే వేళ....!
పసివారిని
పది పరీక్షల పేరిట
ముప్పును ముందుంచటం భావ్యమా!
బాలల ఆరోగ్యం
వడ దెబ్బకు
భద్రమా !
ఆలోచించాల్సిన అవసరం అవశ్యకమైంది !
మార్పు చేయాల్సిన
పరిస్థితి ఆసన్నమైంది.. !!
🌻🌻🌻🌻🌻🌻
*-T.భాస్కర్ Hm*
*Zphs ఏద్దుమైలారం*
*M:కంది*.
🙏🙏🙏🙏🙏🙏