Friday, January 1, 2021

కాంక్ష

🌞🌻🦚🌈🌦️🌲   
     కాంక్ష
కాలగమనం కదలిక లో
ఒక సంవత్సరపు  మైలు రాయి కదిలిపోయింది  
కరోనా కరాళా నృత్యంతో     
ఒక వార్షికం కన్నీటి ధారగా  మిగిలి పోయింది .

మండుటెండలో మొదలై,
మంచు కురిసేదాకా మహమ్మారిలా కొనసాగుతూ...,
చరిత్ర గతినే మార్చేస్తూ భీభత్సాన్ని సృష్టించింది
ప్రపంచాన్ని పరిహాసిస్తూ భయోత్పాదాన్ని  నెలకొల్పింది.

కాలగమనానికి సంకెళ్లు  వేసి
 సకల  సంపదలు  నిర్వీర్యం చేసి, మానవీయ సంబంధాలు మరుగున పరచి,
చరిత్ర మరువని
చెరగని ముద్రలతో,
రక్త చారికలను కాలం నుదుట తిలకంగా  దిద్ది,   మరువలేని విషాదాన్ని 
మనసు నిండా నింపేసి,
అంతులేని వింత జీవిగా విస్తరిస్తూనే వుంది.

నిస్తేజమైన జీవితాలు,
నింగికేగిసిన మహనీయులు,
 ఆర్డ్రత నిండిన నేత్రాలు,
బరువెక్కిన  హృదయాలు,
ముసిరిన
వేదన వలయాలు,
మానవాళి మనుగడను ప్రశ్నించిన ఇరువై ఇరువై,
నీకో కోటి వందనం.

 కరుణ లేని కరోనా
ఇక  మరుగున పడిపో,
ఇకనైనా కనికరించి వదిలిపో....! 
 ఆంక్షలు లేని  స్వేచ్ఛా  జీవనం  పునరుద్ధ రించడానికి,
చదువుల తల్లి వదనం లో  ఆనందం తొణికిసలా డడానికి,
ఆగమైన ఆర్థికస్థితిగతులు కుదురుకోవడానికి,
మళ్ళి సాధారణ జీవనం  గాడిన పడడానికి,  
  ఆవేదన తో
 అర్థిస్తున్నాం..!
ఆశగా ఎదురుచూస్తున్నాం..!
రాబోవు సంవత్సరం
నీ ఊసు లేకుండానే గడవాలని!
నీ  ఆలోచన రాకుండా  సాగాలని !!
🙏🙏🙏
"నూతన సంవత్సరం శుభాకంక్షాలు "💐💐
       -T. భాస్కర్
         G Hm
          Zphs     
        yeddumailaram.

No comments:

Post a Comment