Monday, April 29, 2024

శ్రీ గాజర్ల రమేశ్ DEO గారికి

Date 18-05-2014

ఉన్నత లక్ష్యం 
మహోన్నత ఆశయం 
మమేకమై, మార్గదర్శకమై
 పోషణ లేమితో,పర్యవేక్షణ లోపంతో బుడిబుడి అడుగులతో తడబడుతున్న 
 విద్యా వ్యవస్థకు 
నడక నేర్పి, 
నడవడిక చేర్చి
 పరిగెత్తించాలనే పట్టుదల 
 రాజీ పడలేదు 
రాజకీయ ఒత్తిడికి తలవంచలేదు 
ఫలితం ఊహించిన
 ప్రమాదం అని అంతరంగం హెచ్చరించిన, 
మడమతిప్పని వ్యక్తిత్వం 
పోరాట యోధుని దీరత్వం 
కడలిని తలపించే గాంభీర్యం, అస్తమించడానికి భయపడిన 
భానుడిలా 
మెతుకు సీమలో
 మీ ప్రస్థానం అసమాన్యమైనది
 అనిర్వచనమైంది.

 ప్రమాణాలు పెంచాలి
 ఫలితాలు మెరుగుపడాలి 
పదే పదే పలికిన పిలుపుకు అభినందనలు బదులు అపనిందలు 
సత్కారానికి మారుగా 
వ్యతిరేక పవనాలు..వీచిన,
తిరుగుబాటు జెండా ఎగిరిన 
వ్యక్తిగా మీకు అది శాపం 
వాస్తవానికి అది వ్యవస్థ లోపం..

 మొక్కవోని కర్తవ్య దీక్ష 
అధికార దుర్వినియోగానికి నిస్తేజమై 
బదిలీ బాణంతో 
బడుగు వర్గాల సేవకు 
తాత్కాలికంగా దూరమైనా 
ఆదర్శ అవ్వాలి మీకు..!
 నిబద్దతోకూడిన పూనమ్ మేడం 
విధి నిర్వహణ 
సవాల్ స్వీకరించే 
స్మిత మేడం కర్తవ్య బోధన
  
మబ్బులు పట్టిన 
చంద్రుని వెన్నెల తరగదు 
అవరోధాలు ఎన్ని వచ్చినా 
విజయుని కాంక్ష మారదు 
మీరు మీరు గానే ఉండి
పని రాక్షసత్వాన్ని సజీవంగా నిలిపి 
కలసి రాని కాలంలో కూడా 
మీ నిష్ఠత 
నిర్వీర్యం కాకుండా 
విద్యా వ్యవస్థను 
బ్రతికివ్వడానికి
 మీరు వేసే ప్రతి అడుగు...
 తెలంగాణ రాష్ట్రానికి
 వెలుగు రేఖల నింపాలి 
సదా భగవంతుడు 
మీ కుటుంబాన్ని ఆనందంతో,
విజయం వర్ధిల్లెలా 
ఆశీర్వదించాలని, 
ఆశీస్సులు అందించాలని 
సదా మీ విజయాన్ని 
మనస్ఫూర్తిగా కోరుకునే..

-T. భాస్కర్ HM
Zphs సికిందర్ పూర్ మండల హత్నూర

No comments:

Post a Comment