"విశాల"వదనం
🌹🌸🌼
బాపు గీసిన బొమ్మ కన్నా.. మనోహరం,
బాలు పాడిన పాట కన్నా.. మాధుర్యం, సుబ్బలక్ష్మి సుప్రభాతం లోని తియ్యదనం,
వేటూరి రచనలోని చాతుర్యం,
వసంతం పరచిన సొగసును,
జాబిల్లి విరిచిన వెన్నెలను,
కలబోసి....,
నెమలి పింఛం లాంటి నయనాలు,అధరాలపై కొలువు తీరిన నిటారైన నాసిక, నయాగరా జలపాతాన్ని
తలపే ..వాలుజడ,
అజంతా శిల్పంగా.., పికాసో చిత్రంగా.., అందమైన మనసున్న సుందర రూపం ,
హిమాలయాల అంత ఎత్తైన వ్యక్తిత్వం, వృత్తిలో నిర్వహణ ఆదరణతో కూడిన దైవత్వం,
అనునిత్యంసాగే
నీ ఆలోచనలు ..
సమాజ హితం,
అందుకే..
అభిమాన పుష్పాంజలి!
అభినందనల భాష్పంజలి!!
🌈🦋👑
No comments:
Post a Comment