Saturday, April 10, 2021

మరోఉద్యమం

మరో ఉద్యమం
 వేల సంవత్సరాల ఔనత్యమైన వేద సంస్కృతి,
 పురాణ గాధలతో పునీతమైన భరతభూమి,
 పరదేశీయుల పాలనలో రెక్కలూడిన విహంగమై
  పాశ్చాత్యుల  కబంధహస్తాల్లో  నలిగి
 పిల్లోడు దురాగతానికి ఆవిరైన స్వేచ్ఛ జలపాతం
 దాస్యశృంఖలాల తో  తల్లడిల్లిన భారతీయుల ఆత్మగౌరవం
 ఉవ్వెత్తున ఎగిసిపడి  ఊరూరా వందేమాతర ఉద్యమమై
 ఉరికంబం ఎక్కిన త్యాగధనుల  తల లెన్నో
 ఊపిరి వదిలిన అమరవీరుల బలిదానాలెన్నెన్నో 
 ఆగస్టు 15న అర్ధరాత్రి ఎగిరిన స్వతంత్ర పతాకం
 భావోద్వేగం తో నిండిన భారతీయ జాతీయ భావం 
 మువ్వన్నెల రూపంతో ముచ్చటైన జెండా గా పింగళి చేతిలోని రూపమై
 రాజ్యాంగం పేరిట అంబేద్కర్ ఆలోచన తో అద్భుతమైన ఆకృతై ప్రపంచ దేశం కొనియాడే లా ప్రతి పౌరుడు గర్వపడేలా నీరాజనాలందుకుంటున్న భారత మాతకు జేజేలు భావితరానికి ఆదర్శమైన అమరులకు జోహార్లు
 డెబ్బది ఐదు వసంతాల ప్రజాస్వామ్యంలో అవ లోకానికి అరిష్టాలు అనేకం
 పేదోడి గుండె గాయానికి ఉన్నోడి అధికార దర్పానికి వెలుగులోకి రాని వెతలెన్నో
 వెక్కిరించి అణగారిన వర్గాల బతుకు బాటలో ముళ్ళ పొదలు,
 చేయుతకై చేతులు చాచే నిరాశ్రయుల హాహాకారాలకు
 అంతులేని అనంతమైన విషాదగాథ పుటలు స్వతంత్ర భారతావనిలో కోకొల్లలు

అసమానత చోటు లేకుండా అన్యాయానికి తావివ్వకుండా
 అబలలు అరాచకానికి బలవ్వకుండా
 అక్రమాలకు  అడ్రస్ ఎక్కడ లేకుండా
 భారతావని ముర వాలంటే
 మరో స్వాతంత్ర్య ఉద్యమం రావాలి
 మనమంతా భాగస్వామ్యం కావాలి

T. భాస్కర్
 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ZPHS ఎద్దుమైలారం
 కంది మండలం.
9441823803

No comments:

Post a Comment