వానమ్మ ఇది నీ కరుణమ్మా
జీవకోటి కిఇది నీ వరమమ్మా,
ఆకాశం ఆనందం తో అందమైన హరివిల్లై మెరుపులతో మురిపాన్ని మబ్బుల మాటున తెలపగా,
వానమ్మ!!
తేమ ను తాకిన మట్టిలోని బీజం రాజసంగా తలెత్తుకొని తొలి అడుగులతో తొణికిసలాడగా
వానమ్మ !!
వానలు వరదలతో పుడమి పులకరించి అన్నదాత హర్షించగ సుజలాం సుఫలాం సమస్త జీవరాశి సంతోషించగ
వానమ్మ!!
No comments:
Post a Comment