Wednesday, February 5, 2020

జలఘోష


జనం గుండెల్లో జల ఘోష 
వేదనగా మారుతున్నది 
జలంతో పులకరించాలసిన పుడమి రోదనలతో వణుకుతున్న ది 
జీవం మనుగడకు
మూలమైన ప్రాణాధారం కనుమరుగవుతున్నది,
దరిత్రి  నీటి ఎద్దడితో
నిర్జల ఆవాసంగా మిగులుతున్నది
వెంచర్ పేరిట హరిత
వనాన్ని ని హరించి 
పారిశ్రామీకరణ తో 
పంచభూతాలను మాలిన్యం చేసి , చల్లగా తేలియాడే నల్లటి మేఘాలు ,పుడమి పులకరించే వర్షపు జల్లులు కానరాకుండా కనుమరుగుకు కారణమవుతూ,
 ఆకాశాన్నంటే కాంక్రీట్ భవంతుల అవసర నిమిత్తంమై
 పాతాళంలోని తేమను  పైకి తోడాలని, బోరు కత్తులతో
 ధరణి తనువంతా గాయం చేసి ,
సుడులు తిరిగే రాతి దుమ్ముతో 
కరగని రాతి కొండల్ని 
రాలని నీటి బిందువుల్ని 
పరికిస్తు ఫలితాలను అనుభవిస్తూ ఉక్కిరి బిక్కిరై ఊపిరి అందక
 వినిపించే సునామి ప్రకంపనలను గర్జించే భూకంపాల  ఆర్తనాదాలకు కారకుడవు నీవేనని గుర్తించు, 
మనుగడ ముప్పని  గుర్తించు ఫలితాన్నిచ్చే ..
ప్రత్యామ్నాయాలపై అన్వేషించు
 పచ్చని చెట్లు 
పర్యావరణాన్ని రక్షించుటకై 
ఇంటింటా ఇంకుడు గుంతలను నిర్మించి వర్షపు నీరు ఇంకుటకై అహర్నిశలు శ్రమించు!!

No comments:

Post a Comment