Thursday, February 6, 2020

వేదన

కారు చీకట్లు చేధించిన కాంతి రేఖలు..
కొత్త ఉత్సాహాన్ని ఊరించి..!
కనుమరుగైన సంధ్యా కాంతులు...
నిలువెల్లా నైరాశ్యం ఆవహించి...!!
కదలి రాని,కరిగిరాని చెలియ మౌనం..
ఎడబాటు వెలితి తో అలుముకున్న మౌన రోదన..!
కనుచూపు కైన
కానరాకూడదనే కాటిన్యం..
గుండె లోతుల్లో గుచ్చుకున్న 
నరక యాతన..!
ఉప్పెన లా ఉబికి వచ్చు ఉద్వేగం..
కన్నిటిధార లో మసక బారిన 
నిత్య శోధన..! 
కుంగుబాటు కౌగిలి లో
ఎడారి తలపించే జీవనయానం..
ఎందరు ఉన్నా ఒంటరితనం వేధిస్తూ
జీవన సాధన..!

ఎదురుచూపు లో అలసిపోయి ఆవిరైనాఆశల 
ఎండమావులు,
గుండె ఘోష లో
 పేక మేడల కూలిన ఊహ చిత్రాలు ,
జ్ఞాపకాల అలల ధాటికి 
తడిసిపోయిన కలల తీరాలు,
బ్రతుకు బాటలో కర్పూరం ల కరిగిపోయిన కాలం
కడకు మిగిల్చిన కడు చేదు నిజం.

No comments:

Post a Comment