Friday, May 14, 2021

ఉగాది 💐💐

🥭🥭🥭🥭
ఉగాది ఉషోదయం వసంతాన్ని వాకిట పరిచి
పండగ షడ్రుచులు
జీవన బాష్యాన్ని
మిళితం చేసి
మోడుబారిన వృక్షాలు
కొత్త అందాన్ని సంతరించికొని
చివురించిన లేత ఆకులు
మయూరంలా నర్తిస్తూ 
అవని అందాలను ఆస్వాదిస్తూ
తన్మయత్వంతో కోయిల గానం చేస్తూ,
చెట్ల పూతలు
కొమ్మాల కాతలు
కమ్మని వాసన విరజిల్లుతు
ప్రకృతి రమణీయత పరిడవిల్లి
సాహిత్య పీపాసకుల
మదిలో జాలువరే ఆలోచలు
కవితల ప్రవాహాన్ని సృష్టిస్తూ
కన్నుల కింపైన కిన్నారసాని వోలె
తెలుగు నూతన సంవత్సరం
నవ వధువు శోభను సంతరించుకొని
తెలుగు వారి ఇంటింటా
ఆనందపురం హరివిల్లును అందిస్తూ
చేదును అధరాలతో అధిమి
తియ్యధానాన్ని నోటినిండా పంచాలని
శార్వాణి లా కరోనా మయం కాకుండా
ప్లవనం సగటు జీవిని సంతృప్తం చేయాలనీ
సర్వేజనా సుఖినోభవంతు కావాలని
ఆశిద్దాం, ఆశీర్వచనం కావాలని ప్రార్థిద్దాం..!
-T . భాస్కర్
ప్రధానోపాధ్యాయులు
Zphs ఎద్దుమైలారం
M:కంది
సంగారెడ్డి జిల్లా

No comments:

Post a Comment