కరోనా మేఘాలు కమ్ముకున్నాయి
కన్నీటి గాథల్ని
వెల్లువలా పారిస్తున్నాయ్
ఆసుపత్రులు అంబులెన్సు సైరన్
తో మ్రోగుతూన్నాయి
ఆక్సిమీటర్లు
అలసి పోయి నిస్సత్తు వతో నేలవాలుతు న్నాయి
ఊపిరాడక ఎగిసిపడే ఉదరాలు...
ఆగక సాగె మరణాలు..
మనోవేదన కలిగిస్తున్నాయి
ఉత్పరివర్తనం చెంది
ఉన్మాదంతో
సూక్ష్మ రూపాలు
నిశీధి నిశ్శబ్దాన్ని జీవితాల్లో సృష్టిస్తున్నాయి
ప్రాణాలతో చెలగాటం వెంటిలేటర్ వెనక సాగె వ్యాపారం
రాబందుల్లా పీక్కుతినే
వికృత యమ కింకర్లు
పచ్చ నోట్ల పరుగులో
మానవతను మరిచి చేయూత నివ్వాల్సిన చేతులు
ప్రాణాలు హరించడానికి
యామపాశమై
గొంతు నొక్కడం లో
ఊరితాడుని మరిపిస్తున్నాయి
ఆరని చితి మంటలు
బాధితుల ఆక్రందనలు
మిన్నంటిన రోదనలు మానవ సంబంధాల్ని మరుగున పరుస్తూ వేదనతో వేగుతున్న
జన చిత్రం
వాస్తవాన్ని అద్దం పడుతున్నాయి
బ్రతుకు భయంతో
రూపురేఖలు మారుతున్నాయి
రాబోయే ఉషోదయం
ప్రపంచాన్ని
నీలి నీడల నుండి విముక్తి చెయాలనీ
కరోనా పోరులో సమాజం
విజేత గా నిలవాలని..!
ఊపిరి ఆగడం ఇకనైనా శాశ్వతంగా నిలిచిపోవాలని..!!
😥😥😥😥😥😥
😔😔😔😔😔😔
No comments:
Post a Comment